ముల్లంగి ఆకుల పచ్చడి
కావలసిన పదార్ధాలు:
ముల్లంగి ఆకులు 1
పచ్చి మిరప కాయలు 4-6
చింతపండు నిమ్మకాయంత
ఎండు మిరప కాయలు 2
మెంతులు 2 స్పూన్లు
ఆవాలు 3 స్పూన్లు
నూనె 50 గ్రాములు
ఎండు కారం 2 స్పూన్లు
వెల్లుల్లి 10 రెబ్బలు (optional)
తయారీ విధానం:
ముల్లంగి ఆకలు బాగా కడిగి ఆరబెట్టుకోవాలి.
పచ్చి మిరపకాయల్ని నిలువుగా చీల్చి పెట్టుకోవాలి.
బాణలిలో నూనె లేకుండా ముందుగ 1 స్పూన్ మెంతులు వేసి బాగా వేగాక, ఆవాలు 2 స్పూన్లు వేసి సువాసన వచ్చేదాకా వేయుంచుకొని పళ్ళెంలో పోసి చల్లారబెట్టాలి. చల్లారిన తరువాత మిక్సిలో పొడిచేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆకులు, మిరపకాయలు,చింతపండు బాగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత ఉప్పు వేసి మిక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి.
అదే బాణలిలో మిగిలిన నూనె వేసి ముక్కలు చేసిన వెల్లుల్లి,1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఎండు మిరప కాయలు వేసి అవి చిటపట లాడాకా కారం వేసి వెంటనే రుబ్బిన ఆకుల్ని వేసి మగ్గ నివ్వాలి.
చల్లారిన తరువాత4-5 స్పూన్లు మెంతిపొడి కలిపి డబ్బాలోగాని, సిసాలోగాని గాలి చొరబడకుండా దాస్తే వారం రోజులు నిలువ వుంటుంది.