Andhra veg cuisine along with other veg delicacies from all over India that would surely tickle your tastebuds!!!
Showing posts with label aavakooralu. Show all posts
Showing posts with label aavakooralu. Show all posts

Wednesday, June 24, 2009

కందా బచ్చలి


కావలసిన పదార్ధాలు:
కంద 1/2 KG
బచ్చలి 1 కట్ట
చింతపండు నిమ్మకాయంత
ఉప్పు తగినంత
నూనే 2 స్పూన్లు
చిన్న బెల్లం ముక్క
పోపుకి:
ఆవాలు 1/2 స్పూను
మినపప్పు 1/2 స్పూను
సెనగపప్పు 1/2 స్పూను
ఎండు మిరపకాయ 1
కరివేపాకు పోపుకి తగినంత
సన్నగా తరిగిన పచ్చిమిరప కాయలు 5
సన్నగా తరిగిన అల్లం 1 అంగుళం
ఆవకి:
ఆవాలు 3 స్పూన్లు
పసుపు చిటెకెడు
పచ్చిమిర్చి 1
తయారీ విధానం:
కందని చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి బాణలిలో వేసి ఉడికించు కోవాలి. కంద కాస్త మెత్తగా ఉడికాక సన్నగా తరిగిన బచ్చలి కూడా కందతో పాటు ఉడకనివ్వాలి. బచ్చలి కూడా మెత్తబడ్డాక( ఉడుకుతూ ఉండగానే) చింతపండు రసం, తగినంత ఉప్పు, బెల్లం వేసి మరి కాసేపు(ఒక 5 నిముషాలు) ఉడకనివ్వాలి. ఇప్పుడు నీటిని వడబోసి కందబచ్చలి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

బాణలిలో 2 స్పూన్లు నూనే వేసి పోపు సామగ్రి వెయ్యాలి, అవి కాస్త చిటపటలాడాకా కంద బచ్చలి మిశ్రమాన్ని వేసి కాస్త మగ్గనివ్వాలి. గరిటతో చిదమి (కాస్త ముద్దగా ఉండాలి) స్టవ్ మీదు నుండి దించి పెట్టుకోవాలి.

పైన చెప్పిన ఆవసామగ్రిలో కాస్త నీరు పోసి మెత్తగా రుబ్బి ఒక నిమిషం తరువాత కూరకి కలపాలి.
అద్బుతమైన కంద బచ్చలి కూర తిని ఆస్వాదించండి.
వైవిధ్యం:
పనస పొట్టు కూర కూడా పైన చెప్పిన విధంగా చెయ్యవచ్చు.

Read more...

Lorem Ipsum

Lorem

  © Blogger template AutumnFall by Ourblogtemplates.com 2008

Back to TOP