Andhra veg cuisine along with other veg delicacies from all over India that would surely tickle your tastebuds!!!

Thursday, April 1, 2010

పుదీనా పచ్చడి

పూదీనా 1 కట్ట
మినపప్పు 1 కప్పు
ఎండుమిరపకాయలు 3-4
చింతపండు నిమ్మకాయంత
ఉప్పు తగినంత

మూకుట్లో, మిరపకాయలు నూనె లేకుండా ఎఱ్ఱగా వేయించుకోవాలి. అవి తీసి నూనె లేకుండా పుదీనా ఆకు చింతపండుతో కలిపి వేయించుకోవాలి.
ముందుగా మినపప్పు , మిరపకాయలు మిక్సిలో పొడికొట్టి దాంట్లో పుదీనా, చింతపండు వేసి కాస్త నీరు, తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి.
ఈ పచ్చడి ఇడ్లీలతో, దోసెలతో చాలబాగుంటుంది.

Read more...

Sunday, February 14, 2010

ముల్లంగి ఆకుల పచ్చడి

కావలసిన పదార్ధాలు:
ముల్లంగి ఆకులు 1
పచ్చి మిరప కాయలు 4-6
చింతపండు నిమ్మకాయంత
ఎండు మిరప కాయలు 2
మెంతులు 2 స్పూన్లు
ఆవాలు 3 స్పూన్లు
నూనె 50 గ్రాములు
ఎండు కారం 2 స్పూన్లు
వెల్లుల్లి 10 రెబ్బలు (optional)

తయారీ విధానం:

ముల్లంగి ఆకలు బాగా కడిగి ఆరబెట్టుకోవాలి.
పచ్చి మిరపకాయల్ని నిలువుగా చీల్చి పెట్టుకోవాలి.
బాణలిలో నూనె లేకుండా ముందుగ 1 స్పూన్ మెంతులు వేసి బాగా వేగాక, ఆవాలు 2 స్పూన్లు వేసి సువాసన వచ్చేదాకా వేయుంచుకొని పళ్ళెంలో పోసి చల్లారబెట్టాలి. చల్లారిన తరువాత మిక్సిలో పొడిచేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆకులు, మిరపకాయలు,చింతపండు బాగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత ఉప్పు వేసి మిక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి.

అదే బాణలిలో మిగిలిన నూనె వేసి ముక్కలు చేసిన వెల్లుల్లి,1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఎండు మిరప కాయలు వేసి అవి చిటపట లాడాకా కారం వేసి వెంటనే రుబ్బిన ఆకుల్ని వేసి మగ్గ నివ్వాలి.

చల్లారిన తరువాత4-5 స్పూన్లు మెంతిపొడి కలిపి డబ్బాలోగాని, సిసాలోగాని గాలి చొరబడకుండా దాస్తే వారం రోజులు నిలువ వుంటుంది.

Read more...

Tuesday, August 11, 2009

హాయ్!
అందరూ బాగున్నారా!
సారీ ఈ మధ్య కొన్ని అనివార్య కారణాలవల్ల బ్లాగ్ update చెయ్యలేకపోయాను.
అర్ధం చేసుకుంటారుకదూ!
-శాంతి మల్లాది

Read more...

గుమ్మడికాయ కూర/ pumpkin curry

గుమ్మడి కాయ 1/2kg
పచ్చిమిరపకాయలు 3
అల్లం 1inch
ఆమ్చూర్ పౌడర్ 1/2tsp
పంచదార 1/2tsp
నూనె 2tsp
ఉప్పు తగినంత


పోపుకి: ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు.


గుమ్మడికాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పచ్చిమిరపకాయలు, అల్లం సన్నగా తరగాలి.
నాన్ స్టిక్ పాన్లో నూనెవేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి చిటపటలాడాక తరిగిన గుమ్మడి ముక్కలని వేసుకోవాలి. బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. (మూతపెడితే ముద్దగా అయిపోతుంది, దగ్గరుండి మూత లేకుండా వేయించుకోవాలి.)
ఇప్పుడు తగినంత ఉప్పు, ఆమ్చూర్ పొడి, పంచదార వేసి బాగా కలిపి దించుకోవాలి.
ఈ కూర అన్నం లోకే గాక రోటి, పరోటాల్లోకి కూడా బాగుంటుంది.

Read more...

Thursday, July 30, 2009

tomato chutney / టమాటో కూర

Zareena this is for you!!

టొమాటోలు సన్నగా తరిగినవి 4
ఉల్లిపాయలు సన్నగా తరిగినవి 2
వెల్లుల్లి రెబ్బలు సన్నగా సన్నగా తరిగినవి 4
కరివేపాకు 4
పచ్చిమిరపకాయలు 2
ఆవాలు 1/4 tsp
మెంతులు కాసిన్ని
ఎండుమిరపకాయ ముక్కలు
ఉప్పు తగినంత
కొత్తిమిర సన్నగా తరిగినది

ముందుగా నూనెలో వెల్లుల్లి వేయించుకొని దాంట్లో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపటలాడాక ఉల్లిచెక్కు వేసి అవి ఎర్రగా వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి దగ్గరగా మగ్గనివ్వాలి. అంటే టొమాటోలు మెత్తగా అయ్యేదాకా.
స్టవ్ పై నుండి దించాక సన్నగా తరిగిన కొత్తిమిర జల్లాలి.

Read more...

రవ్వ లడ్డు / ravva laddu

గోధుమ రవ్వ 1 cup
కొబ్బరి తురుము 1 cup
పంచదార 1 cup( sweet ఎక్కువ తినేవారు ఒక పావు గ్లాస్ ఎక్కువ తీసుకోవచ్చు)
పాలు కాస్త చిలకరించడానికి
ఏలకులు పొడి 1/4 స్పూన్
వేయించిన జీడిపప్పు, కిస్మిస్ 1/4 cup
నెయ్యి సరిపడినంత

రవ్వ 2 spoons నేతిలో బాగా వేయించి పక్కనపెట్టుకోవాలి. దాంట్లో పంచదార కలపాలి.
2 spoons నేతిలో కొబ్బరి తురుము కూడా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించి దాంట్లో ఈ పై మిశ్రమాన్ని కలిపి తిప్పుతూ ఉండాలి. అవి బాగా కలిసాక వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి వేసి, కాస్త పాలు చిలకరించి కలిపి మూత పెట్టి స్టవ్ మీద 5 నిమిషాలు ఉంచి దింపుకోవాలి.
కాస్త వేడివేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవాలి.

Read more...

Sunday, July 26, 2009

బీన్స్ కూర / beans poriyal

Serves: 2

బీన్స్ 1/4kg
కొబ్బరి తురుము 1/2 cup
ఆవాలు 1/2 tsp
మినపప్పు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
ఇంగువ చిటికెడు
ఎండుమిరపకాయ
కరివేపాకు 4
నూనె 2tsp
ఉప్పు తగినంత

బీన్స్ సన్నగా తరిగి ఉడికించు కోవాలి.
నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపట లాడేకా ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాకా కొబ్బరి తురుము వేసి వేయించాలి.
కొబ్బరి వేగాక ఉడికించిన బీన్స్ వేసి, ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి.
కూర రెడీ!

Read more...

Friday, July 24, 2009

చక్కెర పొంగలి / Chakkera pongali

ఈ రోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం. అమ్మవారికి ఏంటో ప్రీతికరమైన చక్కెరపొంగలి చేసి నైవేద్యం పెడితే బాగుంటుంది కదా!

బియ్యం 1 cup
పెసరపప్పు 1/2 cup
చక్కర 1 1/2 cup
పాలు 1 cup
నెయ్యి 6tsp
పచ్చి/ఎండుకొబ్బరి ముక్కలు కొన్ని
జీడి పప్పు
ిస్మిస్
ఏలకలు పొడి 1/2 tsp

బియ్యం, పెసరపప్పు 2 tsp నెయ్యి వేసి ఎర్రగా వేయించుకొని తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. (నేనైతే కుక్కర్లో ఉడికించాను - తొందరగా జరగాలని).
బాగా దగ్గరబడ్డాకా పాలు పోసి మిగతా నెయ్యి వేసి దగ్గరగా ఉడికించుకొని, పంచదార కలిపాలి. పంచదార పాకం వచ్చే దాక స్టవ్ మీద ఉంచి ఏలకలుపొడి వేసి కలిపి కిందకు దించుకోవాలి.
ఒక చెంచాడు నేతిలో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పొంగలికి కలపాలి!
వేడి వేడిగా పైన మరింత నెయ్యి వేసుకొని తింటే ఇంకా మజాగా ఉంటుంది!

Read more...

మామిడికాయ మెంతిముక్కలు

పచ్చి మామిడి కాయలు 4 (సన్నగా తరిగినవి )
ఆవపొడి 1/2 కప్పు
ఎర్ర కారం 1/4 కప్పు
ఇంగువ పావు స్పూను
ఉప్పు తగినంత
నూనె 1 కప్పు

అన్ని కలిపి పెట్టి ఒక రోజు తరువాత వేసుకొని తినవచ్చు.
ఆవపొడి కోసం:
పావుకప్పు మెంతులు ఎర్రగా వేయించి దాంట్లో అరకప్పు ఆవాలు కలిపి చిటపటలాడే వరకు వేయించుకొని, చల్లారాక పొడి కొట్టుకోవాలి.
(పచ్చడి కారం/ ఆవకాయ కారం లేకపోతె యందు మిరపకాయలు కూడా కలిపి వేయించుకొని పొడి కొట్టాలి)

Read more...

Thursday, July 23, 2009

వంకాయ కొత్తిమిర కారం / vankaaya kothimirakaaram

Serves 2-4

చిన్న వంకాయలు 1/2 కిలో
కొత్తిమీర 1 కట్ట(పెద్దది)
పచ్చిమిరపకాయలు 5-6
చిన్న అల్లం ముక్క
తగినంత ఉప్పు
నూనె 5-6 స్పూన్లు


వంకాయలని నిలువుగా ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక వంకాయ ముక్కలని బాగా వేయించాలి.
అవి బాగా వేగాక కొత్తిమీర, పచ్చిమరపకాయలు, అల్లం ముక్క, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బి వేగుతున్న ముక్కలలో వేసి ఒక 10 నిముషాలు వేగనివ్వాలి.
నోరూరించే వంకాయ కూర రెడీ!

వంకాయలు కాయ పాలంగా కూడా పైన చెప్పిన మసాల కూరి ఈ కూర చెయ్యవచ్చు!

Read more...

బఠాణి చాట్

2 cups నానబెట్టిన ఎండుబఠాణి
1/2 tsp బేకింగ్ సోడా
చిటికెడు ఇంగువ
2 ఆలూ దుంపలు (ఉడికించి, చెక్కు తీసి ముక్కలు చేసినవి
1 సన్నగా తరిగిన ఉల్లిపాయ
1 సన్నగా తరిగిన టమాటా
1 కీరదోస చెక్కు తీసి సన్నగా తరిగినది
నిమ్మ రసం
చాట్ మసాలా
ఉప్పు తగినంత
ఎర్ర కారం
గరం మసాలా పొడి
నల్ల ఉప్పు
జీల కర్ర పొడి

వెడల్పాటి పాన్లో నాన బెట్టిన బఠాణి వేసి అవి మునిగే వరకు నీరు పోయాలి. సోడా, ఇంగువ వేసి దాదాపు 15 నిమిషాలు బఠాణి మెత్తగా ఉడికేవరకు మీడియం మంటలో ఉడికించాలి. నీరు వార్చుకొని పెట్టుకోవాలి.
తినేటప్పుడు ప్లేట్లో రెండు గరిటలు ఉడికిన బఠాణి వేసి పైన కొంచెం ఉల్లిపాయలు, కీర ముక్కలు, టమాటాలు, ఆలూ ముక్కలు జల్లుకోవాలి.
పైన మసాలా వేసుకొని, కొంచెం చింతపండు మరియు పుదినా చట్నీ వేసుకొని నిమ్మరసం పైన పిండుకోవాలి.
అన్నింటిని బాగా కలుపుకొని తింటే బాగుంటుంది.

Read more...

Wednesday, July 22, 2009

పొట్లకాయ పెరుగుపచ్చడి / snakegourd in yogurt

Serves: 2

పెరుగు 2 cups
పొట్లకాయ 1/2 సైజు (సన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు 2
ఉప్పు తగినంత
కొత్తిమిర కొంచెం

పోపుకి:
ఆవాలు 1/2 tsp
మెంతులు 1/4 tsp
మినపప్పు 1/2 tsp
ఎండుమిరపకాయ 1
ఇంగువ చిటికెడు
కరివేపాకు 3-4 ఆకులు
నూనె 2tsp

పెరుగుని చిలికి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు కలిపి పెట్టుకోవాలి.
మూకుట్లో నూనె వేసి ఆవాలు , మెంతులు, మినపప్పు, మిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపటలాడాక ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాకా సన్నగా తరిగిన పొట్లకాయ వేసి మగ్గనివ్వాలి.
తగినంత ఉప్పు వేసి కలియబెట్టి ముక్కలు మెత్త బడిన తరువాత స్టవ్ మీద నుండి దించి పెరుగులో కలపాలి. అంతే!

Read more...

Tuesday, July 21, 2009

Read more...

SURYA GRAHANAM / సూర్య గ్రహణం

రేపు అనగా బుధవారం 22-07-09 ఆషాడ బహుళ అమావాస్య నాడు ప 5:28 - 7:21 వరకు సూర్య గ్రహణ కాలము. గ్రహణం పునర్వసు, పుష్యమి నక్షత్రాల యందు పడుతునందున ఈ నక్షత్రములవారు, కర్కాటక రాశి వారు చూడరాదు.

Read more...

Monday, July 20, 2009

వేరుశెనగపప్పు చట్ని/ Groundnut chutney


Serves: 2

వేరుశనగపప్పు 2 cups
చింతపండు(నిమ్మకాయంత) రసం
పచ్చిమిరపకాయలు 4
చిన్న అల్లం ముక్క

పోపుకి:
ఆవాలు 1 tsp
మెంతులు 1 tsp
ఎండుమిరపకాయ 1
కరివేపాకు తగినంత
ఇంగువ చిటికెడు
నూనె 1 tsp

పప్పు కమ్మని వాసన వచ్చేదాకా వేయించి పొట్టు తీసుకోవాలి.
పొట్టు తీసిన పప్పు, చింతపండు రసం, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కతగినంత ఉప్పు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు నూనెలో ఆవాలు, మెంతులు, కరివేపాకు, మిరపకాయలు వేసి అవి చితపతలాడాకా ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాక రుబ్బిన చట్నీలో కలపాలి అంతే!
ఈ చట్నీ ఇడ్లిల్లోకి, దోసల్లోకి బాగుంటుంది!

Read more...

Saturday, July 18, 2009

బీరకాయ దోశ / ridgegourd dosa

Serves: 2

బీరకాయ పెద్దది 1

పెసరపప్పు 2 cups
పచ్చిమిరపకాయలు 2
జీలకర్ర 1 tsp
Garnishing:
ఉల్లిపాయ 1
అల్లం 1 inch
పచ్చిమిరపకాయ 1

పెసరపప్పుని ఒక గంట నానబెట్టుకోవాలి.
బీరకాయని చెక్కు తీసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. (చెక్కుతో పచ్చడి చేసుకోవచ్చు)
పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పెసరపప్పు, బీరకాయ, తగినంత ఉప్పు వేసి, తక్కువుగా నీరు పోసి మరీ పలుచగా కాకుండా రుబ్బుకోవాలి.
పిండి తో దోశ వేసి దానిపై బాగా సన్నగా తరిగిన పచ్చిమిరప, అల్లం, ఉల్లి చెక్కు వేసి కాలిస్తే మళ్ళి మళ్ళి తినాలనిపించే బీరకాయ దోశ రెడీ!

Read more...

ఉండ్రాళ్ళు / Undrallu

వినాయక చవితినాడు అందరు తప్పక చేసుకొనే, స్వామికి ఎంతొ ప్రీతికరమైన ఉండ్రాళ్ళు ఈ రోజు చెప్పుకుందాం. ఇప్పట్నుంచే ఎందుకంటే నిన్న మా తోటికోడలు(ఢిల్లీలో ఉంటుంది) అంది క్రిందటి సంవత్సరం సరిగా కుదరలేదు అందుకే ఒకసారి ట్రై చేసి చూస్తాను చవితిలోగా అని, అప్పుడు వచ్చింది ఈ ఆలోచన.

కావలసిన పదార్ధాలు:
బియ్యం రవ్వ 2 cups
శెనగ పప్పు 1/4 cup
జీలకర్ర 1 tsp
నూనె 1 tsp
ఉప్పు తగినంత

శెనగ పప్పు ముందుగ ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి.
4 cups నీరు స్టవ్ మీద పెట్టి అది మరుగుతుండగా ఉప్పు, నూనె, జీలకర్ర, శెనగ పప్పు వేయాలి. నీరు బాగా మరిగాక రవ్వ వేసి మంట తగ్గించి దగ్గర పడే దాక కలుపుతూ ఉంటే మంచిది.
చల్లారనిచ్చి నేతితో(చేతికి నెయ్యి రాసుకొని) ఉండలుగా చేసుకోవాలి.
వీటిని ఇడ్లి ప్లేట్లలో గాని, కుక్కర్ గిన్నెలో గాని పెట్టి కుక్కర్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
వేడి తగ్గకా నెయ్యివేసి సర్వ్ చేయండి!

Read more...

Friday, July 10, 2009

రవ్వ దోశ & కొబ్బరి పచ్చడి

రవ్వ దోశకి:

గోధుమ రవ్వ 1 cup
మైదా 1 cup
వరిపిండి(బియ్యప్పిండి) 11/2 cup

పుల్ల పెరుగు 2 cups
పచ్చిమిరపకాయలు 4
అల్లం 1 inch
జీలకర్ర 1 tsp
ఉప్పు తగినంత
నూనె తగినంత

ముందుగా రవ్వ,మైదా, వరిపిండి తగినంత ఉప్పు వేసి పెరుగు మరి కొంత అవసరమైతే నీరు పోసి గరిటజారుగా కలుపుకోవాలి.

దానికి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర కలిపి ఒక 1-2 గంటలు నాననిచ్చి దోశలు వేసుకోవడమే!!
ఇష్టపడితే ఉల్లి చెక్కు కూడా పైన వేసుకోవచ్చు.




కొబ్బరి పచ్చడికి:

కొబ్బరి 1 cup

పుట్నాల పప్పు 1 cup

పచ్చిమిరపకాయలు 4

ఉప్పు తగినంత

పైన చెప్పినవన్నీ కొంచెం నీరు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

నూనెలో కొంచెం ఆవాలు, తక్కువగా మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పోపుపెట్టి పచ్చడిలో కలపాలి.

ఈ పచ్చడి అన్ని రకాల దోసలతో తినడానికి బాగుంటుంది!!

Read more...

Thursday, July 9, 2009

mh2t9xkgzc

Read more...

Wednesday, July 8, 2009

ఆలూ మటర్ / Aloo matar


3 ఆలూ
1/2 కప్ పచ్చి బఠాణీ
1/2 కప్ పెరుగు
3 పచ్చి మిరపకాయలు
1 ఉల్లిపాయ
3 టొమాటోలు
1 inch అల్లం
1/2 tsp ధనియాలపొడి
1 tsp ఎర్రకారం
1/2 tsp గరం మసాల
2 tbsp నూనె
ఉప్పు తగినంత
1 tsp పసుపు
కొంచెం కొత్తిమిర

తరిగిన ఆలూ, బఠాణీ ఉడికించుకోవాలి. దాంట్లో సగం ఆలూ ముద్దగా చేసీ పెట్టుకోవాలి.
ఉల్లిపాయ, మిరపకాయలు, అల్లం కొంచెం నీరుపోసి మెత్తగా రుబ్బుకోవాలి .
నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడాక పై ముద్దని వేసి బాగా వేయించాలి.
దాంట్లో తరిగిన టొమాటోలు, ఉప్పు, పసుపు, ఎర్రకారం, ధనియాలపొడి, గరం మసాల వేసి బాగా కలపాలి.
ఇప్పుడు దానికి ఆలూ, బఠాణీ, ఆలూ పేస్టు, ఒక కప్ నీరు చేర్చి మూత పెట్టి ఉడకనివ్వాలి.
పెరుగు చిలికి కూరకి కలిపి సన్నని మంట పై చిక్కటి గ్రేవీ తయారయ్యేదాక ఉంచాలి.
కొత్తిమిర సన్నగా కట్ చేసి పైన చల్లాలి.
ఆలూ మటర్ రెడీ అయిపొయింది! వేడి వేడి పరాట్టాల్తో గాని పూరితో గాని సర్వ్ చేయండి!!

Read more...

Lorem Ipsum

Lorem

  © Blogger template AutumnFall by Ourblogtemplates.com 2008

Back to TOP