Andhra veg cuisine along with other veg delicacies from all over India that would surely tickle your tastebuds!!!

Thursday, July 30, 2009

tomato chutney / టమాటో కూర

Zareena this is for you!!

టొమాటోలు సన్నగా తరిగినవి 4
ఉల్లిపాయలు సన్నగా తరిగినవి 2
వెల్లుల్లి రెబ్బలు సన్నగా సన్నగా తరిగినవి 4
కరివేపాకు 4
పచ్చిమిరపకాయలు 2
ఆవాలు 1/4 tsp
మెంతులు కాసిన్ని
ఎండుమిరపకాయ ముక్కలు
ఉప్పు తగినంత
కొత్తిమిర సన్నగా తరిగినది

ముందుగా నూనెలో వెల్లుల్లి వేయించుకొని దాంట్లో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపటలాడాక ఉల్లిచెక్కు వేసి అవి ఎర్రగా వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి దగ్గరగా మగ్గనివ్వాలి. అంటే టొమాటోలు మెత్తగా అయ్యేదాకా.
స్టవ్ పై నుండి దించాక సన్నగా తరిగిన కొత్తిమిర జల్లాలి.

Read more...

రవ్వ లడ్డు / ravva laddu

గోధుమ రవ్వ 1 cup
కొబ్బరి తురుము 1 cup
పంచదార 1 cup( sweet ఎక్కువ తినేవారు ఒక పావు గ్లాస్ ఎక్కువ తీసుకోవచ్చు)
పాలు కాస్త చిలకరించడానికి
ఏలకులు పొడి 1/4 స్పూన్
వేయించిన జీడిపప్పు, కిస్మిస్ 1/4 cup
నెయ్యి సరిపడినంత

రవ్వ 2 spoons నేతిలో బాగా వేయించి పక్కనపెట్టుకోవాలి. దాంట్లో పంచదార కలపాలి.
2 spoons నేతిలో కొబ్బరి తురుము కూడా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించి దాంట్లో ఈ పై మిశ్రమాన్ని కలిపి తిప్పుతూ ఉండాలి. అవి బాగా కలిసాక వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి వేసి, కాస్త పాలు చిలకరించి కలిపి మూత పెట్టి స్టవ్ మీద 5 నిమిషాలు ఉంచి దింపుకోవాలి.
కాస్త వేడివేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవాలి.

Read more...

Sunday, July 26, 2009

బీన్స్ కూర / beans poriyal

Serves: 2

బీన్స్ 1/4kg
కొబ్బరి తురుము 1/2 cup
ఆవాలు 1/2 tsp
మినపప్పు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
ఇంగువ చిటికెడు
ఎండుమిరపకాయ
కరివేపాకు 4
నూనె 2tsp
ఉప్పు తగినంత

బీన్స్ సన్నగా తరిగి ఉడికించు కోవాలి.
నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపట లాడేకా ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాకా కొబ్బరి తురుము వేసి వేయించాలి.
కొబ్బరి వేగాక ఉడికించిన బీన్స్ వేసి, ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి.
కూర రెడీ!

Read more...

Friday, July 24, 2009

చక్కెర పొంగలి / Chakkera pongali

ఈ రోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం. అమ్మవారికి ఏంటో ప్రీతికరమైన చక్కెరపొంగలి చేసి నైవేద్యం పెడితే బాగుంటుంది కదా!

బియ్యం 1 cup
పెసరపప్పు 1/2 cup
చక్కర 1 1/2 cup
పాలు 1 cup
నెయ్యి 6tsp
పచ్చి/ఎండుకొబ్బరి ముక్కలు కొన్ని
జీడి పప్పు
ిస్మిస్
ఏలకలు పొడి 1/2 tsp

బియ్యం, పెసరపప్పు 2 tsp నెయ్యి వేసి ఎర్రగా వేయించుకొని తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. (నేనైతే కుక్కర్లో ఉడికించాను - తొందరగా జరగాలని).
బాగా దగ్గరబడ్డాకా పాలు పోసి మిగతా నెయ్యి వేసి దగ్గరగా ఉడికించుకొని, పంచదార కలిపాలి. పంచదార పాకం వచ్చే దాక స్టవ్ మీద ఉంచి ఏలకలుపొడి వేసి కలిపి కిందకు దించుకోవాలి.
ఒక చెంచాడు నేతిలో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పొంగలికి కలపాలి!
వేడి వేడిగా పైన మరింత నెయ్యి వేసుకొని తింటే ఇంకా మజాగా ఉంటుంది!

Read more...

మామిడికాయ మెంతిముక్కలు

పచ్చి మామిడి కాయలు 4 (సన్నగా తరిగినవి )
ఆవపొడి 1/2 కప్పు
ఎర్ర కారం 1/4 కప్పు
ఇంగువ పావు స్పూను
ఉప్పు తగినంత
నూనె 1 కప్పు

అన్ని కలిపి పెట్టి ఒక రోజు తరువాత వేసుకొని తినవచ్చు.
ఆవపొడి కోసం:
పావుకప్పు మెంతులు ఎర్రగా వేయించి దాంట్లో అరకప్పు ఆవాలు కలిపి చిటపటలాడే వరకు వేయించుకొని, చల్లారాక పొడి కొట్టుకోవాలి.
(పచ్చడి కారం/ ఆవకాయ కారం లేకపోతె యందు మిరపకాయలు కూడా కలిపి వేయించుకొని పొడి కొట్టాలి)

Read more...

Thursday, July 23, 2009

వంకాయ కొత్తిమిర కారం / vankaaya kothimirakaaram

Serves 2-4

చిన్న వంకాయలు 1/2 కిలో
కొత్తిమీర 1 కట్ట(పెద్దది)
పచ్చిమిరపకాయలు 5-6
చిన్న అల్లం ముక్క
తగినంత ఉప్పు
నూనె 5-6 స్పూన్లు


వంకాయలని నిలువుగా ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక వంకాయ ముక్కలని బాగా వేయించాలి.
అవి బాగా వేగాక కొత్తిమీర, పచ్చిమరపకాయలు, అల్లం ముక్క, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బి వేగుతున్న ముక్కలలో వేసి ఒక 10 నిముషాలు వేగనివ్వాలి.
నోరూరించే వంకాయ కూర రెడీ!

వంకాయలు కాయ పాలంగా కూడా పైన చెప్పిన మసాల కూరి ఈ కూర చెయ్యవచ్చు!

Read more...

బఠాణి చాట్

2 cups నానబెట్టిన ఎండుబఠాణి
1/2 tsp బేకింగ్ సోడా
చిటికెడు ఇంగువ
2 ఆలూ దుంపలు (ఉడికించి, చెక్కు తీసి ముక్కలు చేసినవి
1 సన్నగా తరిగిన ఉల్లిపాయ
1 సన్నగా తరిగిన టమాటా
1 కీరదోస చెక్కు తీసి సన్నగా తరిగినది
నిమ్మ రసం
చాట్ మసాలా
ఉప్పు తగినంత
ఎర్ర కారం
గరం మసాలా పొడి
నల్ల ఉప్పు
జీల కర్ర పొడి

వెడల్పాటి పాన్లో నాన బెట్టిన బఠాణి వేసి అవి మునిగే వరకు నీరు పోయాలి. సోడా, ఇంగువ వేసి దాదాపు 15 నిమిషాలు బఠాణి మెత్తగా ఉడికేవరకు మీడియం మంటలో ఉడికించాలి. నీరు వార్చుకొని పెట్టుకోవాలి.
తినేటప్పుడు ప్లేట్లో రెండు గరిటలు ఉడికిన బఠాణి వేసి పైన కొంచెం ఉల్లిపాయలు, కీర ముక్కలు, టమాటాలు, ఆలూ ముక్కలు జల్లుకోవాలి.
పైన మసాలా వేసుకొని, కొంచెం చింతపండు మరియు పుదినా చట్నీ వేసుకొని నిమ్మరసం పైన పిండుకోవాలి.
అన్నింటిని బాగా కలుపుకొని తింటే బాగుంటుంది.

Read more...

Wednesday, July 22, 2009

పొట్లకాయ పెరుగుపచ్చడి / snakegourd in yogurt

Serves: 2

పెరుగు 2 cups
పొట్లకాయ 1/2 సైజు (సన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు 2
ఉప్పు తగినంత
కొత్తిమిర కొంచెం

పోపుకి:
ఆవాలు 1/2 tsp
మెంతులు 1/4 tsp
మినపప్పు 1/2 tsp
ఎండుమిరపకాయ 1
ఇంగువ చిటికెడు
కరివేపాకు 3-4 ఆకులు
నూనె 2tsp

పెరుగుని చిలికి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు కలిపి పెట్టుకోవాలి.
మూకుట్లో నూనె వేసి ఆవాలు , మెంతులు, మినపప్పు, మిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపటలాడాక ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాకా సన్నగా తరిగిన పొట్లకాయ వేసి మగ్గనివ్వాలి.
తగినంత ఉప్పు వేసి కలియబెట్టి ముక్కలు మెత్త బడిన తరువాత స్టవ్ మీద నుండి దించి పెరుగులో కలపాలి. అంతే!

Read more...

Tuesday, July 21, 2009

Read more...

SURYA GRAHANAM / సూర్య గ్రహణం

రేపు అనగా బుధవారం 22-07-09 ఆషాడ బహుళ అమావాస్య నాడు ప 5:28 - 7:21 వరకు సూర్య గ్రహణ కాలము. గ్రహణం పునర్వసు, పుష్యమి నక్షత్రాల యందు పడుతునందున ఈ నక్షత్రములవారు, కర్కాటక రాశి వారు చూడరాదు.

Read more...

Monday, July 20, 2009

వేరుశెనగపప్పు చట్ని/ Groundnut chutney


Serves: 2

వేరుశనగపప్పు 2 cups
చింతపండు(నిమ్మకాయంత) రసం
పచ్చిమిరపకాయలు 4
చిన్న అల్లం ముక్క

పోపుకి:
ఆవాలు 1 tsp
మెంతులు 1 tsp
ఎండుమిరపకాయ 1
కరివేపాకు తగినంత
ఇంగువ చిటికెడు
నూనె 1 tsp

పప్పు కమ్మని వాసన వచ్చేదాకా వేయించి పొట్టు తీసుకోవాలి.
పొట్టు తీసిన పప్పు, చింతపండు రసం, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కతగినంత ఉప్పు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు నూనెలో ఆవాలు, మెంతులు, కరివేపాకు, మిరపకాయలు వేసి అవి చితపతలాడాకా ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాక రుబ్బిన చట్నీలో కలపాలి అంతే!
ఈ చట్నీ ఇడ్లిల్లోకి, దోసల్లోకి బాగుంటుంది!

Read more...

Saturday, July 18, 2009

బీరకాయ దోశ / ridgegourd dosa

Serves: 2

బీరకాయ పెద్దది 1

పెసరపప్పు 2 cups
పచ్చిమిరపకాయలు 2
జీలకర్ర 1 tsp
Garnishing:
ఉల్లిపాయ 1
అల్లం 1 inch
పచ్చిమిరపకాయ 1

పెసరపప్పుని ఒక గంట నానబెట్టుకోవాలి.
బీరకాయని చెక్కు తీసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. (చెక్కుతో పచ్చడి చేసుకోవచ్చు)
పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పెసరపప్పు, బీరకాయ, తగినంత ఉప్పు వేసి, తక్కువుగా నీరు పోసి మరీ పలుచగా కాకుండా రుబ్బుకోవాలి.
పిండి తో దోశ వేసి దానిపై బాగా సన్నగా తరిగిన పచ్చిమిరప, అల్లం, ఉల్లి చెక్కు వేసి కాలిస్తే మళ్ళి మళ్ళి తినాలనిపించే బీరకాయ దోశ రెడీ!

Read more...

ఉండ్రాళ్ళు / Undrallu

వినాయక చవితినాడు అందరు తప్పక చేసుకొనే, స్వామికి ఎంతొ ప్రీతికరమైన ఉండ్రాళ్ళు ఈ రోజు చెప్పుకుందాం. ఇప్పట్నుంచే ఎందుకంటే నిన్న మా తోటికోడలు(ఢిల్లీలో ఉంటుంది) అంది క్రిందటి సంవత్సరం సరిగా కుదరలేదు అందుకే ఒకసారి ట్రై చేసి చూస్తాను చవితిలోగా అని, అప్పుడు వచ్చింది ఈ ఆలోచన.

కావలసిన పదార్ధాలు:
బియ్యం రవ్వ 2 cups
శెనగ పప్పు 1/4 cup
జీలకర్ర 1 tsp
నూనె 1 tsp
ఉప్పు తగినంత

శెనగ పప్పు ముందుగ ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి.
4 cups నీరు స్టవ్ మీద పెట్టి అది మరుగుతుండగా ఉప్పు, నూనె, జీలకర్ర, శెనగ పప్పు వేయాలి. నీరు బాగా మరిగాక రవ్వ వేసి మంట తగ్గించి దగ్గర పడే దాక కలుపుతూ ఉంటే మంచిది.
చల్లారనిచ్చి నేతితో(చేతికి నెయ్యి రాసుకొని) ఉండలుగా చేసుకోవాలి.
వీటిని ఇడ్లి ప్లేట్లలో గాని, కుక్కర్ గిన్నెలో గాని పెట్టి కుక్కర్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
వేడి తగ్గకా నెయ్యివేసి సర్వ్ చేయండి!

Read more...

Friday, July 10, 2009

రవ్వ దోశ & కొబ్బరి పచ్చడి

రవ్వ దోశకి:

గోధుమ రవ్వ 1 cup
మైదా 1 cup
వరిపిండి(బియ్యప్పిండి) 11/2 cup

పుల్ల పెరుగు 2 cups
పచ్చిమిరపకాయలు 4
అల్లం 1 inch
జీలకర్ర 1 tsp
ఉప్పు తగినంత
నూనె తగినంత

ముందుగా రవ్వ,మైదా, వరిపిండి తగినంత ఉప్పు వేసి పెరుగు మరి కొంత అవసరమైతే నీరు పోసి గరిటజారుగా కలుపుకోవాలి.

దానికి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర కలిపి ఒక 1-2 గంటలు నాననిచ్చి దోశలు వేసుకోవడమే!!
ఇష్టపడితే ఉల్లి చెక్కు కూడా పైన వేసుకోవచ్చు.




కొబ్బరి పచ్చడికి:

కొబ్బరి 1 cup

పుట్నాల పప్పు 1 cup

పచ్చిమిరపకాయలు 4

ఉప్పు తగినంత

పైన చెప్పినవన్నీ కొంచెం నీరు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

నూనెలో కొంచెం ఆవాలు, తక్కువగా మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పోపుపెట్టి పచ్చడిలో కలపాలి.

ఈ పచ్చడి అన్ని రకాల దోసలతో తినడానికి బాగుంటుంది!!

Read more...

Thursday, July 9, 2009

mh2t9xkgzc

Read more...

Wednesday, July 8, 2009

ఆలూ మటర్ / Aloo matar


3 ఆలూ
1/2 కప్ పచ్చి బఠాణీ
1/2 కప్ పెరుగు
3 పచ్చి మిరపకాయలు
1 ఉల్లిపాయ
3 టొమాటోలు
1 inch అల్లం
1/2 tsp ధనియాలపొడి
1 tsp ఎర్రకారం
1/2 tsp గరం మసాల
2 tbsp నూనె
ఉప్పు తగినంత
1 tsp పసుపు
కొంచెం కొత్తిమిర

తరిగిన ఆలూ, బఠాణీ ఉడికించుకోవాలి. దాంట్లో సగం ఆలూ ముద్దగా చేసీ పెట్టుకోవాలి.
ఉల్లిపాయ, మిరపకాయలు, అల్లం కొంచెం నీరుపోసి మెత్తగా రుబ్బుకోవాలి .
నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడాక పై ముద్దని వేసి బాగా వేయించాలి.
దాంట్లో తరిగిన టొమాటోలు, ఉప్పు, పసుపు, ఎర్రకారం, ధనియాలపొడి, గరం మసాల వేసి బాగా కలపాలి.
ఇప్పుడు దానికి ఆలూ, బఠాణీ, ఆలూ పేస్టు, ఒక కప్ నీరు చేర్చి మూత పెట్టి ఉడకనివ్వాలి.
పెరుగు చిలికి కూరకి కలిపి సన్నని మంట పై చిక్కటి గ్రేవీ తయారయ్యేదాక ఉంచాలి.
కొత్తిమిర సన్నగా కట్ చేసి పైన చల్లాలి.
ఆలూ మటర్ రెడీ అయిపొయింది! వేడి వేడి పరాట్టాల్తో గాని పూరితో గాని సర్వ్ చేయండి!!

Read more...

yummy bhendi fry


బెండ కాయలు 1/2 kg
ఉల్లిపాయలు 3
ధనియాల పొడి 2 స్పూన్లు
జీలకర్ర పొడి 2 స్పూన్లు
ఎర్రకారం 1 స్పూను
ఉప్పు తగినంత
నూనె 4 స్పూన్లు

మూకుట్లో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కమ్మని వాసన వచ్చే దాక వేయించాలి.
ఇప్పుడు తరిగిన బెండకాయలు వేసి వేగనివ్వాలి. బెండకాయలు బాగా వేగాకా ఉప్పు, కారం వేసి అవి పట్టేంత వరకు వేగనిచ్చి కిందకి దించుకోవాలి.
అంతే కూర ఎంతో సులువుగా ఉంది కదా!

Read more...

Monday, July 6, 2009

English updates

hi!

am gonna update all these recipes in english too..

just wait n see....

Read more...

Friday, July 3, 2009

YOUTH POTION

Hi,

By chance i saw a video by a nutrionist from Mumbai giving the receipe of a youth potion. She assures, as is the dream of many women, of young and youthful skin by a simple potion could be easily prepared in our kitchens.

Focus should always be on takingin plenty of antioxidants, dark green veggies, knowing the limits of intake of food and all these with a smile.

Receipe of the youth potion goes as follows:

1 beetroot
2 carrots
3 tomatoes

Put them in a mixer and if required add a pinch of black salt and two spoons of lemon juice and have it. Isn't it simple!!!

Let's Try.

Read more...

Thursday, July 2, 2009

పెసరట్ల కూర



కావలసిన పదార్ధాలు:

పెసరపప్పు 250 gm
తరిగిన ఉల్లిపాయలు 8
పచ్చిమిరప కాయలు 8
అల్లం 1/2 అంగుళం
జీలకర్ర 3 స్పూన్లు
ధన్యాలు 3 స్పూన్లు
దాల్చినచెక్క 1/2 అంగుళం
లవంగాలు 6
ఏలకలు (వొలిచినవి) ౩
వెల్లుల్లి రెబ్బలు 2
ఎఱ్ఱకారం 1 స్పూన్
ఉప్పు తగినంత
నూనె 4 స్పూన్లు
చింతపండు (నిమ్మకాయంత) రసం


తయారీ విధానం:

ముందుగ పెసరట్లు పోసుకోవాలి. దానికి పెసర పప్పు రెండు గంటలు నీటిలో నానబెట్టి పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బు కోవాలి. ఈ పిండి తో పెసరట్లు బాగా దళసరిగా పోసి పక్కన పెట్టుకోవాలి.
చల్లారిన తరువాత వాటిని స్క్వేర్ గా కాని డైమెండ్ షేపులో కాని కట్ చేసి పెట్టుకోవాలి.

మసాల కోసం తరిగిన ఉల్లిపాయలు, ధన్యాలు, జీలకర్ర, అల్లం,లవంగాలు, ఏలకలు, దాల్చినచెక్క మెత్తగా రుబ్బుకోవాలి.
నాన్ స్టిక్ పాన్ లో నూనె వేడిచేసి దాంట్లో పైన చెప్పిన ఉల్లిమసాల వేసి బాగా ఎర్రగా వేయించాలి.
అందులో చింతపండు రసం వేసి ఉడకనివ్వాలి. అప్పుడు ఎఱ్ఱ కారం వేసి మరి కొంతసేపు వేగనిచ్చి దాంట్లో కట్ చేసిన పెసరట్టు ముక్కలని వేసి మూతపెట్టి సుమారు 5min ఉడకనివ్వాలి.

ఏంతో రుచికరమైన పెసరట్లకూర రెడీ!

Read more...

కొబ్బరి పాయసం

Serves 2-4

కావలసిన పదార్ధాలు:
పాలు 1/2 లీటర్
బియ్యం 1 కప్పు
తురిమిన కొబ్బరి 1 కప్పు
చక్కెర 2 కప్పులు
ఏలకలు పొడి 1 స్పూన్

తయారీ విధానం:
బియ్యం ఒక గంట నీటిలో నానబెట్టుకోవాలి.
స్టవ్ మీద పాలుపెట్టి మరిగించుకోవాలి.
నానిన బియ్యాన్ని, కొబ్బరిని మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
మరుగుతున్న పాలల్లో ఈ మిశ్రమాన్ని వేస్తూ కలుపుతూ ఉండాలి.
కాస్త చిక్కబడిన తరువాత చక్కెర, ఏలకల పొడి వేసి కలపాలి. చక్కెర బాగా కలిసాక స్టవ్ మీదనుండి దించి చల్లారబెట్టాలి.
కొబ్బరి పాయసం రెడీ!

Read more...

Lorem Ipsum

Lorem

  © Blogger template AutumnFall by Ourblogtemplates.com 2008

Back to TOP